‘జీహెచ్‌ఎంసీ’లో 52 వేల టన్నుల వ్యర్థాలు

ABN , First Publish Date - 2020-11-07T06:56:59+05:30 IST

వరదల అనంతరం గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 52 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయని ప్రభుత్వ

‘జీహెచ్‌ఎంసీ’లో 52 వేల టన్నుల వ్యర్థాలు

వరదల వల్ల పేరుకుపోతే తొలగించాం: సీఎస్‌ సోమేశ్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): వరదల అనంతరం గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 52 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. వాటిని 960 బృందాలు ఏర్పాటు చేసి తొలగించామని చెప్పారు.


సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగరంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌, బస్తీ దవాఖానాల పనితీరు, మిగిలిపోయిన వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయ పంపిణీపై మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించారు.  

Updated Date - 2020-11-07T06:56:59+05:30 IST