వచ్చే 3 నెలల్లో 50 రెస్టారెంట్ల మూత!

ABN , First Publish Date - 2020-04-24T10:19:57+05:30 IST

ప్రభు త్వం నుంచి సరైన మద్దతు లభించకపోతే.. తెలంగాణలోని 50 శాతం రెస్టారెంట్లు వచ్చే రెండు మూడు నెలల్లో మూతపడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

వచ్చే 3 నెలల్లో 50 రెస్టారెంట్ల మూత!

ఆర్‌ఏఐ సమావేశంలో తెలంగాణ రిటైలర్లు 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌):  ప్రభు త్వం నుంచి సరైన మద్దతు లభించకపోతే.. తెలంగాణలోని 50 శాతం రెస్టారెంట్లు వచ్చే రెండు మూడు నెలల్లో మూతపడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం అధిక శాతం చిల్లర దుకాణాలు దాదాపు 30 శాతం పనివారితోనే నెట్టుకొస్తున్నాయని  కోవిడ్‌-19 ప్రభావంపై భారత రిటైలర్ల సంఘం (ఆర్‌ఏఐ) నిర్వహించిన సమావేశంలో పరిశ్రమ వర్గాలు తెలిపాయి.


వస్తు సరఫరా సమస్యగా ఉందని, వినియోగదారుల వినియోగ తీరులో మార్పు వస్తోందని క్యూ-మార్ట్‌ రిటైల్‌ ఎండీ బీవీకే రాజు తెలిపారు. వ్యాపారాలు కొనసాగాలంటే.. కొంత ఆదాయాన్ని ఆర్జించక తప్పదని, టెక్నాలజీలను వినియోగించుకుని గేటెడ్‌ కమ్యూనిటీ్‌సకు డెలివరీలు చేస్తున్నట్లు ఆల్మండ్‌ హౌస్‌ ఎండీ చైతన్య ముప్పాల చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఖాతాదారులనే కాపాడుకోవాలని సెలెక్ట్‌ మొబైల్స్‌ డైరెక్టర్‌ మురళీ రేతినేని అన్నారు. 

Updated Date - 2020-04-24T10:19:57+05:30 IST