భాష్యం విరాళం రూ.50 లక్షలు

ABN , First Publish Date - 2020-03-30T10:38:49+05:30 IST

భాష్యం విరాళం రూ.50 లక్షలు

భాష్యం విరాళం రూ.50 లక్షలు

తెలుగు రాష్ట్రాల సహాయ నిధులకు 25 లక్షల చొప్పున అందజేత

గుంటూరు, మార్చి 29: కరోనా వైరస్‌పై పోరాటానికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ  రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సీఎం సహాయనిధులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... కరోనా విపత్తును అందరూ సమష్ఠిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ, రెండు రాష్ట్రాల సీఎంలు కరోనాను అరికట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. వైద్య సిబ్బంది, పోలీస్‌, పారిశుధ్య సిబ్బంది సమర్థంగా పని చేస్తున్నారని కొనియాడారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని కోరారు. 

Updated Date - 2020-03-30T10:38:49+05:30 IST