కన్వీనర్ కోటాలో 476 సీట్లు ఖాళీ
ABN , First Publish Date - 2020-12-19T07:20:28+05:30 IST
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీటు ఖరారైన 476 మంది ఇప్పటి వరకూ కాలేజీల్లో చేరలేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీటు ఖరారైన 476 మంది ఇప్పటి వరకూ కాలేజీల్లో చేరలేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. కన్వీనర్ కోటాకు సంబంధించి కేవలం తొలి రౌండు కౌన్సెలింగ్‌నే నిర్వహించారు. రెండో రౌండును చేపట్టకుండానే యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను గురువారం సాయంత్రం భర్తీ చేశారు.
ఇప్పుడు కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లకు ఒకటి, రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. కాగా, డిసెంబరు 31లోగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌ను ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలుండటంతో హెల్త్ వర్సిటీ మరో ఐదు రౌండ్ల ప్రక్రియను వేగంగా నిర్వహించనుంది.