42 నిమిషాలు.. రెండు పెయింటింగ్స్
ABN , First Publish Date - 2020-09-14T09:36:23+05:30 IST
నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన చిత్రకారుడు, జాతీయ అవార్డు గ్రహీత బరిగెల శ్రీనివాస్..
చండూరు, సెప్టెంబరు 13 : నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన చిత్రకారుడు, జాతీయ అవార్డు గ్రహీత బరిగెల శ్రీనివాస్.. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఆదివారం తన దుకాణంలో లైవ్ షో ఏర్పాటు చేశారు. రజాకార్ల తుపాకీకి చెయ్యి అడ్డుపెట్టి కొడవలి ఎత్తిన యువకుడు, సాయుధ పోరాటంలో అమ్మానాన్నను కోల్పోయిన చిన్నారి.. తుపాకీ గొట్టానికి జెండా కట్టి నివాళులర్పిస్తున్నట్లున్న చిత్రాలను 42 నిమిషాల్లో గీశారు.