మహేశ్వరంలో నలుగురికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-29T18:37:57+05:30 IST

హైదరాబాద్: మహేశ్వరంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహేశ్వరంలో నలుగురికి కరోనా పాజిటివ్

హైదరాబాద్: మహేశ్వరంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. మహేశ్వరంలో ఆర్డీవో రవీందర్రెడ్డి ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డిలు కరోనా నివారణపై ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ప్రభుత్వ వైద్య శాఖ అధికారులతో సమావేశమవుతున్నారు. 


మహేశ్వరం పట్టణ కేంద్రంలోని హర్షగూడ గ్రామానికి బావమరిది దగ్గరికి వెళ్లిన వ్యక్తితో పాటు అతని కుమారుడికి కరోనా వ్యాధి సోకలేదు అని తేలింది. అయితే ఆ వ్యక్తి భార్యకు అతని కుమార్తె, అల్లుడికి మాత్రం కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారి కుటుంబ సభ్యులను నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా హర్షగూడ గ్రామంలో 5 సంవత్సరాల పాపకు కరోనా వ్యాధి సోకినట్లు తేలింది.

Updated Date - 2020-05-29T18:37:57+05:30 IST