ఆశచూపి.. 4 లక్షలు దోచేశారు

ABN , First Publish Date - 2020-10-03T09:46:19+05:30 IST

అప్పులు గంపెడయ్యాయి. వేరే దారిలేక కిడ్నీ అమ్మేసి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి

ఆశచూపి.. 4 లక్షలు దోచేశారు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2(ఆంధ్రజ్యోతి): అప్పులు గంపెడయ్యాయి. వేరే దారిలేక కిడ్నీ అమ్మేసి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోయాడు. నాగోల్‌ ఆనంద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం ఆన్‌లైన్‌లో శోధించాడు. కిడ్నీ వితరణ ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చని ఒక ప్రకటన కంటబడింది. ఒక్క కిడ్నీకి రూ.3 కోట్లు ఇస్తామని దానిలో ఉంది. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమంటూ అందులోని వాట్సాప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేశాడు. వ్యక్తిగత వివరాలతోపాటు రూ.10వేల రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని అవతలి వ్యక్తి బదులిచ్చాడు. దాంతో వారి ఖాతాలో ఆ డబ్బులతోపాటు వివిధ చార్జీల రూపేణా దాదాపు రూ.4లక్షల వరకు జమ చేశాడు. ఆ తర్వాత అటునుంచి స్పందన లేదు. దీంతో రాచకొండ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-10-03T09:46:19+05:30 IST