కాటేసిన కరెంటు తీగలు.. నలుగురు రైతుల మృతి

ABN , First Publish Date - 2020-09-29T07:13:19+05:30 IST

నేల తల్లిని నమ్ముకుని, ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే అన్నదాతలను కరెంటు కాటేసింది. సోమవారం పలు జిల్లాల్లో జరిగిన దుర్ఘటనల్లో నలుగురు రైతులు మృత్యువాత పడగా, ఓ విద్యుత్తు అధికారి, మరో

కాటేసిన కరెంటు తీగలు.. నలుగురు రైతుల మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నేల తల్లిని నమ్ముకుని, ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే అన్నదాతలను కరెంటు కాటేసింది. సోమవారం పలు జిల్లాల్లో జరిగిన దుర్ఘటనల్లో నలుగురు రైతులు మృత్యువాత పడగా, ఓ విద్యుత్తు అధికారి, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పక్క చేనులో అడవి పందుల నుంచి రక్షణ కోసం కరెంటు తీగలు పెట్టిన విషయం తెలియక.. వాటికి తగిలి నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని కిర్గుల్‌‘(కే)కు చెందిన రైతు రాజలింగం(47) చనిపోయాడు. నాగర్‌కర్నూలు జిల్లా చారకొండ మండలం ఇద్దంపల్లిలో జల్లల కొండల్‌ యాదవ్‌ (30), నల్లగొండ-నాగర్‌కర్నూల్‌ జిల్లాల సరిహద్దు దేవరకొండ మండలం ఇద్దంపల్లిలో జల్లెల కొండల్‌(30), జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని తుమ్మలచెర్వులో కుర్వ ఆంజనేయులు (28)లు పొలంలో మోటార్‌కు విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు.  మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులలోని బీసీ కాలనీలో రంగం చంద్రాయుడు (52) గాలికి తెగి కింద పడిన  తీగలను తొక్కడంతో చనిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేస్తుండగా షాక్‌కు గురై ఏఈ శ్రీధర్‌(32) ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-09-29T07:13:19+05:30 IST