సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో త్రీడీ మోడల్ డిస్‌ప్లే

ABN , First Publish Date - 2020-07-20T21:59:32+05:30 IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో త్రీడీ మోడల్ డిస్‌ప్లేను దక్షిణమధ్య రైల్వే అధికారులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో త్రీడీ మోడల్ డిస్‌ప్లే

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో త్రీడీ మోడల్ డిస్‌ప్లేను దక్షిణమధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డిస్‌ప్లేతో స్టేషన్‌లో ఉన్న సౌకర్యాలను తెలుసుకోవచ్చు. ఇందులో ఉన్న 24 బటన్లు స్టేషన్‌లోనే ప్రతి లే ఔట్‌కు అనుసంధానమై ఉంటాయి. రైల్వే స్టేషన్‌లో మొత్తం 10 ఫ్లాట్ ఫారమ్‌లు ఉన్నాయి. ఈ పది ఫ్లాట్ ఫారమ్‌లలో ఎక్కడెక్కడ ఏమోమి ఉన్నాయో పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం ప్రయాణీకులకు అందుబాటులో ఉంచారు. మొత్తం 24 బటన్స్ ఉన్నాయి. ప్రయాణీకులకు కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మనకు బుక్ స్టాల్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే బుక్ స్టాల్ అనే బటన్ నొక్కితే రెడ్ లైట్ వెలిగే ప్రాంతాలు కనిపిస్తాయి. దాంతో అవి ఏ ప్లాట్ ఫారమ్‌లో ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క సమాచారాన్ని ఈ బటన్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

Updated Date - 2020-07-20T21:59:32+05:30 IST