తెలంగాణలో 36కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-03-24T19:00:36+05:30 IST

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 36కు చేరాయి.

తెలంగాణలో 36కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 36కు చేరాయి. మంగళవారం మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లండన్‌ నుంచి వచ్చిన కోకాపేట వాసికి కరోనా సోకింది. జర్మనీ నుంచి వచ్చిన చందానగర్‌ మహిళకు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన బేగంపేట మహిళకు(60) కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. 

Read more