తెలంగాణలో 33కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-03-23T21:19:08+05:30 IST
తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ మీడియా ..

హైదరాబాద్ : తెలంగాణ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ మీడియా ముఖంగా వెల్లడించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అయితే.. ఎవరికీ కూడా సీరియస్‌గా లేదని తెలిపారు.
రేపటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే అత్యవసరం కాని ఆపరేషన్లు కూడా నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు స్థానికంగా ఒకరికి మాత్రమే కరోనా సోకిందన్నారు.