ఆరేళ్లలో 31,052 ఉద్యోగాలు భర్తీ చేశాం
ABN , First Publish Date - 2020-12-11T08:29:58+05:30 IST
కమిషన్ ఏర్పాటైన ఆరేళ్లలో 31,052 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు టీఎ్‌సపీఎస్సీ నివేదించింది. మరో 4,672
4,672 చివరిదశలో ఉన్నాయి.. కోర్టు కేసుల్లో 919 పోస్టులు
గవర్నర్‌కు వార్షిక నివేదిక సమర్పించిన టీఎ్‌సపీఎస్సీ
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కమిషన్ ఏర్పాటైన ఆరేళ్లలో 31,052 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు టీఎ్‌సపీఎస్సీ నివేదించింది. మరో 4,672 పోస్టుల నియామక ప్రక్రియ చివరిదశలో ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై వార్షిక నివేదిక-2019-20ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి టీఎ్‌సపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి గురువారం అందజేశారు.
ఆరేళ్లలో మొత్తం 36,758 పోస్టులు నోటిఫై అయ్యాయని, అందులో 35,724 కొలువుల నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని నివేదించారు. భర్తీశాతం 98గా ఉందని పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ వివిధ విభాగాల్లో 115 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం 919 పోస్టుల నియామకం కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉందని చెప్పారు.
కాగా, ఉద్యోగాల నియామకంలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడం, విజయవంతంగా పోస్టులను భర్తీచేయడంపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. టీఎ్‌సపీఎస్సీ చైర్మన్, సభ్యులను ఆమె అభినందించారు. గవర్నర్‌ను కలిసినవారిలో టీఎ్‌సపీఎస్సీ సభ్యులు విఠల్, చంద్రావతి, మథీనుద్దీన్ ఖాద్రీ, డి.కృష్ణారెడ్డి, సీహెచ్ సాయిలు, కమిషన్ కార్యదర్శి వాణీప్రసాద్ ఉన్నారు.