గ్వాలియర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2020-05-19T02:29:14+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలస్తోంది.

గ్వాలియర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలస్తోంది. మూడంతస్థుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో పెయింట్ షాప్‌ను నిర్వహిస్తున్నారు. షాపులో ఇవాళ అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు కాస్తా దావానంలా మారి బిల్డింగ్ మొత్తానికి అంటుకున్నాయి. దీంతో బిల్డింగ్‌లో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను అర్పేశారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-19T02:29:14+05:30 IST