2,920 వరి కొనుగోలు కేంద్రాలు మూసివేత!

ABN , First Publish Date - 2020-05-29T09:53:28+05:30 IST

వరి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయిన జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ 2,920 కేంద్రాలను మూసివేసింది. కరీంనగర్‌, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా ల్లో 99 శాతం, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి

2,920 వరి కొనుగోలు కేంద్రాలు మూసివేత!

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తయిన జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ 2,920 కేంద్రాలను మూసివేసింది. కరీంనగర్‌, కామారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా ల్లో 99 శాతం, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాల్లో 90 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. ఖమ్మంలో 296, కొత్తగూడెంలో 207, నల్గొండలో 251, సూర్యాపేటలో 248, యాదాద్రి భువనగిరిలో 148, మహబూబ్‌నగర్‌లో 198, వనపర్తిలో 101, నారాయణపేట్‌లో 88, మహబూబాబాద్‌లో 75, జనగామలో 62, కరీంనగర్‌లో 191, కామారెడ్డిలో 312, నిజామాబాద్‌లో 158, జగిత్యాలలో 50, సిరిసిల్లలో 62, పెద్దపల్లిలో 39, మంచిర్యాలలో 33, సంగారెడ్డిలో 63, సిద్దిపేటలో 66, మెదక్‌లో 203, నాగర్‌ కర్నూల్‌లో 30, వికారాబాద్‌లో 10 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. మిగిలిన జిల్లాల్లో 3,466 సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వరి కోతలు ఇంకా జరుగుతున్న జిల్లాల్లో కేంద్రాలు తెరిచే ఉంటాయని పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. ఈ సెంటర్లలో వరి ధాన్యం కొనుగోళ్లను వచ్చే నెలలో కూడా చేపట్టనున్నారు.

Updated Date - 2020-05-29T09:53:28+05:30 IST