26 వేల మందికి ‘స్వేచ్ఛ’
ABN , First Publish Date - 2020-04-07T09:16:48+05:30 IST
ముప్పు నుంచి తెలంగాణ రాష్ట్రం దాదాపు బయట పడ్డట్టేననే అధికారులు అంచనాకు వస్తున్నారు. మరో రెండు రోజులు గడిస్తే ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోమవారం నాటి

- విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నేటితో పూర్తి
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా ముప్పు నుంచి తెలంగాణ రాష్ట్రం దాదాపు బయట పడ్డట్టేననే అధికారులు అంచనాకు వస్తున్నారు. మరో రెండు రోజులు గడిస్తే ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోమవారం నాటి ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ ప్రకారం.. విదే శాల నుంచి వచ్చిన 25,935 మంది క్వారంటైన్ సమయం దాదాపుగా ముగిసింది. మంగళవారం 258 మందికి సంబంధించిన క్వారంటైన్ ముగియనుంది. వీరి నుంచి కొత్తగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం లేదు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌గా తేలినవారు, వారి వల్ల వైరస్ సోకిన వారు 50 మంది ఉన్నారు. వీరిలో 35 మంది కరోనాను జయించారు. మిగిలిన 15 మంది కూడా త్వరలోనే కోలుకోనున్నారు. మర్కజ్ యాత్రికుల విషయానికి వస్తే.. రాష్ట్రంలో వీరి సంఖ్య 1089గా తేలింది. వీరికి సంబంధించి 3500 మందిని క్వారంటైన్ చేశారు. వీరిలో ఇప్పటివరకు 265 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేల్చారు. వీరివల్ల రాష్ట్రంలో పాజిటివ్‌ల సంఖ్య మరో 150 వరకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మర్కజ్ యాత్రికుల కరోనా లింకు కూడా తెగిపోతుంది.