26 కులాలను మళ్లీ బీసీల జాబితాలో చేర్చాలి

ABN , First Publish Date - 2020-12-28T09:35:18+05:30 IST

సీఎం కేసీఆర్‌ రాజకీయ దురుద్దేశంతో బీసీల జాబితా నుంచి 26 కులాలను తొలగించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే ఆ 26 కులాలను బీసీల జాబితాలో

26 కులాలను మళ్లీ బీసీల జాబితాలో చేర్చాలి

లే దంటే ప్రగతి భవన్‌ ముట్టడి: ఆర్‌.కృష్ణయ్య

రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం వద్దు: తళ్లోజు ఆచారీ


మంగళ్‌హాట్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ రాజకీయ దురుద్దేశంతో బీసీల జాబితా నుంచి 26 కులాలను తొలగించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే ఆ 26 కులాలను బీసీల జాబితాలో చేర్చాలని, లే దంటే పది లక్షల మందితో ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలకు న్యాయంగా రావాల్సిన వాటా ఇచ్చేందుకు కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్‌ 26 బీసీ(డిలీటెడ్‌) కమ్యూనిటీస్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీలో బీసీల ఆత్మగౌరవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌.కృష్ణయ్య మాట్లాడారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీలను కేవలం ఓట్ల రూపకంగా చూస్తున్నారని, రిజర్వేషన్‌ అమలు విషయంలో నిర్లక్ష్యం తగదని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యులు తళ్లోజు ఆచారీ అన్నారు. పాత రిపోర్ట్‌ ఆధారంగా 26 కులాలను తొలగించారని, ప్రభుత్వ దుందుడుకు చర్యల కారణంగా బీసీల్లో ఉన్న వారు ఓసీలుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-28T09:35:18+05:30 IST