పీజీ ఈసెట్‌ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు 25 ఆఖరు

ABN , First Publish Date - 2020-11-19T08:20:27+05:30 IST

ఎంఈ, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డీలో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది.

పీజీ ఈసెట్‌ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు 25 ఆఖరు

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎంఈ, ఎంటెక్‌, ఎంఆర్క్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌-డీలో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. ఆన్‌లైన్‌ వెరిఫికేషన్‌కు సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేసేందుకు ఈ నెల 25 ఆఖరు తేదీ అని పీజీఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పి.రమేష్‌ బాబు తెలిపారు.

మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకుగాను వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్ల స్కాన్‌ కాపీలను ఆన్‌లైన్లో సమర్పించాలని కోరారు. 


Updated Date - 2020-11-19T08:20:27+05:30 IST