భైంసా అల్లర్లలో 25 మంది అరెస్టు

ABN , First Publish Date - 2020-05-13T09:48:18+05:30 IST

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో పోలీసులు 25 మందిని అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌లో భాగంగా నిర్మల్‌కు తరలించారు.

భైంసా అల్లర్లలో 25 మంది అరెస్టు

నిర్మల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో  చోటుచేసుకున్న అల్లర్ల ఘటనలో పోలీసులు 25 మందిని అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌లో భాగంగా నిర్మల్‌కు తరలించారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అల్లర్ల కారణంగా విధించిన 144 సెక్షన్‌ కొనసాగుతోంది. దీంతో మంగళవారం పట్టణంలోని అన్ని దుకాణాలను బంద్‌ చేశారు. ఐజీ ప్రమోద్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులతో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అరెస్టయిన 25 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు భైంసా పట్టణంలోని గ్రామీణ పోలీసుస్టేషన్‌కు వెళ్లి గేటు ఎదుట తమ వారి కోసం నిరీక్షించారు. అల్లర్లలో తమ వారికి సంబంధం లేకున్నా అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. 

Read more