భర్తీ కాని 23,070 సీట్లు
ABN , First Publish Date - 2020-11-13T09:06:36+05:30 IST
ఇంజనీరింగ్ చివరి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబరు 30 నుంచి ఈనెల
ఇంజనీరింగ్‌లో 27ు, ఫార్మసీలో 95ు మిగులు.. 3 గ్రామీణ కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు
సీఎస్‌ఈ 3 కొత్త కోర్సులకు డిమాండ్ లేదు
ముగిసిన ఎంసెట్ చివరివిడత ప్రవేశాలు
నేడు స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ చివరి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ముగిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబరు 30 నుంచి ఈనెల 9వరకు ఆప్షన్లు ఇచ్చినవారికి సీట్ల కేటాయింపు పూర్తయింది. మొదటి విడతలో 37,771 మంది ప్రవేశాలు పొందగా, చివరివిడతలో 13,238 విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
కన్వీనర్ కోటాలో మొత్తం 74,079 సీట్లు ఉండగా.. మొదటి, చివరి విడత కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 51,009 సీట్లు భర్తీ కాగా.. 23,070 సీట్లు మిగిలిపోయాయి. విభాగాల వారీగా చూస్తే ఇంజనీరింగ్‌లో 19,276 (27.5ు); ఫార్మసీ, ఫార్మ్-డిలో 3794 (95.8ు) సీట్లు ఖాళీగా ఉన్నాయి. చివరివిడతలో 2777 మంది ఆప్షన్లు ఇచ్చిన చోట సీట్లు లేకపోవడంతో వారికి కేటాయించలేదు.
ఫార్మసీలో 4.2ఽశాతమే..
ఇంటర్ ఎంపీసీ అభ్యర్థులకు కేటాయించే ఫార్మసీలో మొత్తం 3,959 సీట్లు ఉండగా, 165 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో ఇది 4.2ు మాత్రమే. నిబంధనల ప్రకారం మొత్తం సీట్లలో ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివినవారికి చెరి సగం కేటాయించాల్సి ఉంది.
ఫార్మసీలో ప్రవేశాలకు బైపీసీ గ్రూపు విద్యార్థులే ఆసక్తి చూపిస్తారని, ఎంపీసీలో భర్తీ కాని సీట్లను బైపీసీ అభ్యర్థులకే కేటాయిస్తామని సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. బైపీసీ విద్యార్థుల ఫార్మసీ ప్రవేశాలు త్వరలో ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఎంసెట్ స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించే అవకాశాలున్నాయి.
ఐవోటీ 45, సైబర్ సెక్యూరిటీలో 46%
మూడు గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. ఈ కాలేజీలకు చివరి నిమిషంలో సీట్ల కేటాయింపే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఈసారి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశపెట్టిన ఐదు కొత్త కోర్సుల్లో మూడింటిలో కనీసం సగం సీట్లు కూడా నిండలేదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో 210 సీట్లకు 35(16.67ు) మాత్రమే భర్తీ అయ్యాయి.
ఈసారి ఎక్కువగా డిమాండ్ ఉంటుందని భావించిన ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)లో 1281 సీట్లకు 579 (45.2ు), ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీలో 126 సీట్లకు 58(46.03ు) భర్తీ అయ్యాయి. సీఎ్‌సఈ కొత్త కోర్సుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) 126, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్‌లో మాత్రం 100ు(126) సీట్లు భర్తీ అయ్యాయి.
కోర్ ఇంజనీరింగ్‌లోనూ తగ్గాయి..
కోర్ ఇంజనీరింగ్ కోర్సుల పట్ల ఈసారి విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈసీఈలోనే 75ు సీట్లు భర్తీ కాగా, మిగిలిన మూడు కోర్సుల్లో సగం సీట్లు మాత్రమే నిండాయి. ఈసీఈలో 13,657 సీట్లకు 10,298(75.4%), సివిల్ ఇంజనీరింగ్‌లో 6,420కి 3,579(55.75%), ‘ట్రిపుల్ ఈ’లో 6,928కి 3,738(53.95%) సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి మెకానికల్‌లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు.