తెలంగాణలో నేడు 2083 కరోనా కేసులు..
ABN , First Publish Date - 2020-08-01T15:15:51+05:30 IST
హైదరాబాద్: తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శనివారం హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శనివారం హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2083 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 64,786కు చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 17754 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని మొత్తంగా 46,502 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 530కి చేరుకుంది.