బాండ్ల వేలం.. మరో 2 వేల కోట్ల రుణం

ABN , First Publish Date - 2020-05-13T09:30:54+05:30 IST

బాండ్ల వేలం.. మరో 2 వేల కోట్ల రుణం

బాండ్ల వేలం.. మరో 2 వేల కోట్ల రుణం

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల రుణాన్ని బాండ్ల వేలం ద్వారా స్వీకరిం చింది. గత నెల్లో బాండ్ల వేలం ద్వారా రూ.4 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం మరో 2వేల కోట్ల రుణాన్ని తీసుకుంది. ఇందులో రూ.వెయ్యి కోట్లను 5.82ు వడ్డీ  చొప్పున నాలుగేళ్లలో తిరిగి చెల్లించేలా, మరో రూ.వెయ్యి కోట్లను 6.17ు  వడ్దీ చొప్పున ఐదేళ్లలో చెల్లించేలా రుణాన్ని తీసుకుంది. 

Read more