కరోనా నుంచి కోలుకున్నవారు 2 లక్షలు

ABN , First Publish Date - 2020-10-21T10:20:34+05:30 IST

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న రోగుల సంఖ్య 2 లక్షలకు చేరింది. తాజాగా సోమవారం 1,891 మంది రికవరీ అయ్యారు.

కరోనా నుంచి కోలుకున్నవారు 2 లక్షలు

 వర్షాలతో తగ్గుతున్న పరీక్షలు..


హైదరాబాద్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న రోగుల సంఖ్య 2 లక్షలకు చేరింది. తాజాగా సోమవారం 1,891 మంది రికవరీ అయ్యారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 2,02577కు చేరుకుంది. సెప్టెంబరు 2 నాటికి రాష్ట్రంలో మొత్తం కేసులు 1,33,406 కాగా, అప్పటికి రికవరీలు లక్ష దాటాయి. వైరస్‌ ప్రభావం ప్రారంభం నుంచి చూస్తే ఇందుకు ఆరు నెలలు పట్టింది. అయితే, ఈ 48 రోజుల్లోనే మరో లక్ష మంది కోలుకోవడం గమనార్హం. మరోవైపు 15 రోజులుగా వర్షాలు పడుతుండటంతో  కరోనా పరీక్ష కేంద్రాలకు ప్రజలు రావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్రంలో సోమవారం 42,299 మందికి పరీక్షలు చేయగా 1,486 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,24,545కు చేరింది. వైర్‌సతో మరో ఏడుగురు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1282కు చేరింది. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, మేడ్చల్‌లో  102, రంగారెడ్డి జిల్లాలో 112, భద్రాద్రి కొత్తగూడెంలో 98, ఖమ్మంలో 89, కరీంనగర్‌లో 69, నల్లగొండలో 82 నమోదయ్యాయి. 

Updated Date - 2020-10-21T10:20:34+05:30 IST