19 రైల్వే స్టేషన్లకు ఐఎస్‌ఓ అక్రిడిటేషన్
ABN , First Publish Date - 2020-04-08T10:09:56+05:30 IST
పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత పాటించినందుకు, మరింత ప్రభావశీలంగా పాటించడానికి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 19 రైల్వే స్టేషన్లకు ఐఎ్‌సఓ(14001:2015) అక్రిడిటేషన్...

హైదరాబాద్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత పాటించినందుకు, మరింత ప్రభావశీలంగా పాటించడానికి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని 19 రైల్వే స్టేషన్లకు ఐఎ్‌సఓ(14001:2015) అక్రిడిటేషన్ లభించింది. 2020, మార్చి 31 నుంచి మూడేళ్ల నిర్వహణకు ఈ అక్రిడిటేషన్ వచ్చిందని అధికారులు చెప్పారు. 19 స్టేషన్లు విజయవాడ డివిజన్ పరిధిలోనివని తెలిపింది. గూడూరు, నెల్లూరు, గుడివాడ, ఒంగోలు, చీరాల, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, నర్సాపూర్, తెనాలి, రాజమండ్రి, నిడదవోలు, తుని, అన్నవరం, అనకాపల్లి, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లకు పర్యావరణ పరిరక్షణ గుర్తింపు లభించిందని వివరించింది. ముఖ్యంగా స్టేషన్లలో పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, చెత్త తొలగింపు, నీటి నిర్వహణ, రైల్వే ట్రాక్‌ల వెంట శుభ్రత పాటించడం, ఆక్రమణల తొలగింపు, విద్యుత్తు సక్రమ వినియోగం, అడవుల పెంపకానికి మొక్కలు నాటడం వంటి అంశాల ఆధారంగా అక్రిడిటేషన్ లభించిందని తెలిపింది. ఈ మేరకు విజయవాడ డీవీఎం పి.శ్రీనివాస్, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గజనాన్ మాల్యా అభినందించారు.