నవంబరు 9న రాష్ట్రపతికి 15వ ఆర్థిక సంఘం నివేదిక
ABN , First Publish Date - 2020-10-31T09:10:00+05:30 IST
ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం తన నివేదికను నవంబరు 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించనుంది. రాష్ట్రాలకు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ/హైదరాబాద్ అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కే సింగ్ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం తన నివేదికను నవంబరు 9న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించనుంది. రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నులు, గ్రాంట్లకు సంబంధించి ఫార్ములాను సిఫారసు చేయడమే కాక, కేంద్రం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలను సూచిస్తూ 2021-22 నుంచి 2025-26 ఆర్ధిక సంవత్సరాలకు 15వ ఆర్థిక సంఘం తుది నివేదిక రూపొందించింది. చైర్మన్, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, ప్రొ.అనూప్ సింగ్, డా.అశోక్ లాహిరి, డా. రమేశ్ చంద్ నివేదికపై శుక్రవారం సంతకాలు చేశారు. సభ్యులు ప్రధానమంత్రిని కూడా కలిసి నివేదికను అందజేస్తారు. డిసెంబరులో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత ఇతర అంశాలు వెల్లడవుతాయి. ఇప్పటికే 2021 సంవత్సరానికి మధ్యంతర నివేదికను విడుదల చేసింది. చైనాతో సంఘర్షణను దృష్టిలో పెట్టుకుని రక్షణ వ్యయంపై దృష్టి సారించాలని కమిషన్ నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలతో పాటు వివిధ వర్గాల వారితో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత ఈ నివేదిక రూపొందించిందని అధికార వర్గాలు తెలిపాయి.