1564 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

ABN , First Publish Date - 2020-06-19T10:25:33+05:30 IST

ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస(సీఏపీఎఫ్‌) విభాగాల్లో ఖాళీగా ఉన్న 1564 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌

1564 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు

  • స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ ప్రకటన..
  • దరఖాస్తు గడువు జూలై 16

హైదరాబాద్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస(సీఏపీఎఫ్‌) విభాగాల్లో ఖాళీగా ఉన్న 1564 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎ్‌సఎస సీ) ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 1564 ఖాళీల్లో ఢిల్లీ పోలీ‌సలో 169 ఎస్‌ఐ, సీఏపీఎఫ్లో 1395 ఎస్‌ఐ(జీడీ) పోస్టులున్నాయి. సీఆర్‌పీఎఫ్‌, బీఎ‌స్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ తదితర ప్రత్యేక పోలీసు విభాగాలు సీఏపీఎఫ్‌ పరిధిలోకి వస్తాయి. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 25ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 16. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించరు. అభ్యర్థులను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది. మొదటి పేపర్‌ను సెప్టెంబరు 28నుంచి అక్టోబరు 5వరకు, రెండో పేపర్‌ను 2021 మార్చి 1న నిర్వహిస్తారు.

Updated Date - 2020-06-19T10:25:33+05:30 IST