తెలంగాణలో కొత్తగా 1536 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-11-03T15:55:38+05:30 IST

హైదరాబాద్: నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు నేడు మళ్లీ పెరిగాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

తెలంగాణలో కొత్తగా 1536 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: నిన్న కాస్త తగ్గిన కరోనా కేసులు నేడు మళ్లీ పెరిగాయి. తాజాగా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కి చేరుకుంది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 1,351 మంది మృతి చెందారు. తెలంగాణలో 17,742 యాక్టివ్‌ కేసులున్నాయి. 2.23లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 281, భద్రాద్రి 123, రంగారెడ్డి 92, మేడ్చల్‌లో 96 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-11-03T15:55:38+05:30 IST