మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేత వద్ద 15 లక్షలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-10-31T09:20:23+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుడి వద్ద రూ.15 లక్షలు లభ్యమయ్యాయి. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన

మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేత వద్ద 15 లక్షలు స్వాధీనం

హిమాయత్‌నగర్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుడి వద్ద రూ.15 లక్షలు లభ్యమయ్యాయి. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నేతలపై పోలీసులు దృష్టి పెట్టారు. పక్కా వ్యూహంతో కాంగ్రెస్‌ నేత పి.శ్రవణ్‌కుమార్‌ రెడ్డి డబ్బులు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్టు చేశారు. గతంలో మెదక్‌లో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన శ్రవణ్‌కుమార్‌ రెడ్డి నగరంలో జూబ్లీహిల్స్‌లో ఆర్థోపెడిక్‌ వైద్యుడిగా సేవలందిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఇన్నోవా కారులో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ సమీపంలో ఉన్న డీమార్ట్‌కు వచ్చారు. ఇంతలో అక్కడికి చేరుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఆయన కారును తనిఖీ చేశారు. కారు కవర్‌లో ఉంచిన రూ.14.96 లక్షలను సీజ్‌ చేశారు.

Read more