తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి

ABN , First Publish Date - 2020-07-27T17:55:19+05:30 IST

తెలంగాణలో కొత్తగా గత 24 గంటల్లో 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా గత 24 గంటల్లో 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 55,532కు చేరింది. అందులో 42,106 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 12,955 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 471గా ఉంది.


కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 85 నుంచి 90 పాజిటీవ్ కేసులు నమోదవుతుండేవి.. కానీ గడిచిన మూడు వారాల నుంచి హైదరాబాద్‌లో కాకుండా మిగిలిన 32 జిల్లాల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే హైదరాబాద్‌లో కరోనా వ్యాప్తి తగ్గుతుండగా.. జిల్లాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకు కరోనా ప్రభావంలేని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.

Updated Date - 2020-07-27T17:55:19+05:30 IST