తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 1278 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-11T04:00:44+05:30 IST

ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే..

తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 1278 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్ : ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1278 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 8 మంది కరోనాతో మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరుకుంది. గత కొన్నిరోజులుగా రోజూ వెయ్యికిపైగానే కేసులు నమోదవుతుండటం గమనార్హం. కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో ఇవాళ 762 కేసులు నమోదయ్యాయి. మునుపటితో పోలిస్తే నగరంలో ఇవాళ తక్కువ కేసులే నమోదయ్యాయి. రంగారెడ్డిలో 171, మేడ్చల్‌లో 85 కేసులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1278 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 399 మంది కరోనాతో చనిపోయారు. ఓ వైపు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం.. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ అటుంచితే.. కేసీఆర్ సర్కార్ టెస్ట్‌లు సరిగ్గా చేయలేదని.. టెస్ట్‌ల సంఖ్య పెంచాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.



Updated Date - 2020-07-11T04:00:44+05:30 IST