రెండేళ్లలో 1200 చెక్‌డ్యాంలు: హరీశ్‌

ABN , First Publish Date - 2020-03-15T09:20:41+05:30 IST

ప్రతి వర్షపు నీటి చుక్క వృథా కాకుండా ఒడిసిపట్టాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నామని ఆర్థికమంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

రెండేళ్లలో 1200 చెక్‌డ్యాంలు: హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ప్రతి వర్షపు నీటి చుక్క వృథా కాకుండా ఒడిసిపట్టాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నామని ఆర్థికమంత్రి హరీశ్‌ రావు తెలిపారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రెండేళ్లలో 1200 చెక్‌ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిందని, నాబార్డు నిధులతో ఈ ఏడాది 600 చెక్‌ డ్యాంలు నిర్మిస్తామన్నారు. 

Updated Date - 2020-03-15T09:20:41+05:30 IST