సమాచార శాఖలో 12 మందికి పదోన్నతులు
ABN , First Publish Date - 2020-10-28T07:05:25+05:30 IST
సమాచార, పౌర సంబంధాల శాఖలో 12 మందికి ప్రభుత్వం మంగళవారం పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం అదనపు పౌరసంబంధాల

హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): సమాచార, పౌర సంబంధాల శాఖలో 12 మందికి ప్రభుత్వం మంగళవారం పదోన్నతులు కల్పించింది. ప్రస్తుతం అదనపు పౌరసంబంధాల అధికారులుగా విధులు నిర్వహిస్తున్న 10 మందికి జిల్లా పౌరసంబంధాల అధికారులుగా పదోన్నతులు కల్పించినట్లు పేర్కొంది.
ఇద్దరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లకు డివిజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పించామని ఉత్తర్వుల్లో వివరించింది.