సహకార ఎన్నికల్లో 2 రోజుల్లో 11,959 నామినేషన్లు
ABN , First Publish Date - 2020-02-08T10:05:26+05:30 IST
సహకార సంఘాల ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం

హైదరాబాద్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి 11,959 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతి పీఏసీఎస్ పరిధిలో 13 ప్రాదేశిక నియోజకవర్గాలు(టీసీలు) ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో రికార్డుస్థాయిలో 1,091 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు శనివారంతో గడువు ముగుస్తుంది.