సూర్యాపేటలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-07-11T00:05:33+05:30 IST

సూర్యాపేటలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు

సూర్యాపేటలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు

సూర్యాపేట: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో  సూర్యాపేట జిల్లాలో శుక్రవారం రోజు కొత్తగా 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 157 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 67 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వల్ల ముగ్గురు మృతి చెందారు.

Updated Date - 2020-07-11T00:05:33+05:30 IST