ప్రాణాలు కాపాడిన ‘100’

ABN , First Publish Date - 2020-03-15T10:42:56+05:30 IST

ప్రాణాలు కాపాడిన ‘100’

ప్రాణాలు కాపాడిన ‘100’

 నార్కట్‌పల్లి పోలీసులు చొరవతో 

నార్కట్‌పల్లి, మార్చి 14: ఆపదలో ఆదుకునే 100కు చేసిన ఫోన్‌ కాల్‌ ఒకరి ప్రాణాలను కాపాడింది. ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు తన మిత్రుడికి సమాచారం ఇవ్వగా, అతడు 100కు కాల్‌ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందిం చి ప్రాణాలు కాపాడారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని జువ్విగూడెం గ్రామానికి చెందిన ఉపేందర్‌ క్షౌర వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లి.. హైదరాబాద్‌లో ఉంటున్న మిత్రుడికి ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో ఆ మిత్రుడు వెంటనే 100కు కాల్‌ చేసి వివరాలు చెప్పా డు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నార్కట్‌పల్లి ఏఎ్‌సఐ పాంపాటి సత్యనారాయణ, రైటర్‌ మధు వెంటనే స్పందించారు. పొలా ల్లో ఉన్న ఉపేందర్‌ను ఎట్టకేలకు గుర్తించి పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చారు. శనివారం ఉదయం అతనికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 

Updated Date - 2020-03-15T10:42:56+05:30 IST