‘ప్రతి ఆదివారం.. పది గంటలకు.. పది నిమిషాలు’

ABN , First Publish Date - 2020-05-10T14:40:10+05:30 IST

రోనా నేర్పిన పాఠంతో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో

‘ప్రతి ఆదివారం.. పది గంటలకు.. పది నిమిషాలు’

  • డెంగీ నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమం 
  • కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో...

హైదరాబాద్/ సరూర్‌నగర్‌/నార్సింగ్‌/దుండిగల్‌ : కరోనా నేర్పిన పాఠంతో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ‘ప్రతి ఆదివారం - పది గంటలకు - పది నిమిషాలు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి, నార్సింగ్‌, మణికొండ, బండ్లగూడ మున్సిపల్‌ కమిషనర్లు శ్రీనివా్‌సరెడ్డి, జయంత్‌, వేణుగోపాల్‌రెడ్డి, దుండిగల్‌ కమిషనర్‌ ఏ. నరేశ్‌ వేర్వేరుగా తెలిపారు. డెంగీతో పాటు సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత కోసం ఈ ఆదివారం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.


ఇందులో భాగంగా.. అన్ని నీటి వనరులు, ట్యాంకులు, పైపులైన్లు, చేతి పంపులు, ఇతరత్రా నీటి నిల్వ ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ నీరు నిలవకుండా చర్యలు తీసుకోనున్నారు. తద్వారా దోమలు విడుదల చేసిన లార్వా వృద్ధి చెందకుండా అరికట్టడంతో పాటు డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చేయోచ్చని భావిస్తున్నారు.  ఆయా ప్రాంతాల్లో ప్రజలు కూడా ప్రతి ఆదివారం పది గంటలకు తమ పరిధిలో నీరు నిలవకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు.

Updated Date - 2020-05-10T14:40:10+05:30 IST