వైద్య సేవలకు రూ.కోటి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-04-08T09:53:26+05:30 IST
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సేవల విస్తరణకు ఎమ్మెల్సీ కోటా నుంచి రూ.కోటి వెచ్చిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి...

జగిత్యాల టౌన్, ఏప్రిల్ 7: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, వైద్య సేవల విస్తరణకు ఎమ్మెల్సీ కోటా నుంచి రూ.కోటి వెచ్చిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రకటించారు. జగిత్యాల ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందిని శాలువాతో ఘనంగా సన్మానించి నిత్యావసర సరుకులు అందజేశారు.