మానవత్వం చూపేందుకు ఇదే సరైన సమయం: యువరాజ్

ABN , First Publish Date - 2020-05-30T19:31:50+05:30 IST

శుక్రవారం నాటికి 7,466 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.65 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో సాటి

మానవత్వం చూపేందుకు ఇదే సరైన సమయం: యువరాజ్

ముంబై: శుక్రవారం నాటికి 7,466 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు కావడంతో.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 1.65 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో సాటి వారికి సహాయం చేయాలని టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కోరాడు. ‘‘గత 24 గంటల్లో ఇండియా 7వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరం పాటించండి. కష్టాల్లో ఉన్నవారికి అందరం అండగా నిలుద్దాం. మానవత్వం చూపించేందుకు ఇదే సరైన సమయం’’ అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-05-30T19:31:50+05:30 IST