ఆ ‘ఆరు సిక్సర్ల’కు పదమూడేళ్లు

ABN , First Publish Date - 2020-09-20T09:14:17+05:30 IST

2007 టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వీరవిహారం క్రికెట్‌ అభిమానుల మదిలో చెదరని జ్ఞాపకం.

ఆ ‘ఆరు సిక్సర్ల’కు పదమూడేళ్లు

న్యూఢిల్లీ: 2007 టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వీరవిహారం క్రికెట్‌ అభిమానుల మదిలో చెదరని జ్ఞాపకం. ఇంగ్లండ్‌తో లీగ్‌ మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువీ ఆరు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ అద్భుతం జరిగి శనివారానికి పదమూడేళ్లు. ఆ సందర్భాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా యువీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ సందర్భంగా తన స్టిల్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన యువీ.. ‘సమయం ఎంత వేగంగా పరిగెడుతోందో’ అన్న క్యాప్షన్‌ పెట్టాడు. కాగా, యువీ పోస్ట్‌కు బ్రాడ్‌ ఫన్నీగా స్పందించాడు. ‘ఆరోజు రాత్రి బంతి వెళ్లిన వేగం కంటే సమయమే నెమ్మదిగా గడిచింది’ అని బ్రాడ్‌ కామెంట్‌ చేశాడు. దీనికి బదులుగా.. ‘ఆ రాత్రిని మనమందరం మరువలేం’ అని యువరాజ్‌ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌పై గంభీర్‌  సినిమా డైలాగ్‌తో సరదాగా స్పందించాడు. ‘ఆ రికార్డు నాకిచ్చేయ్‌ ఠాకూర్‌ (యే రికార్డ్‌ ముఝే దే దే ఠాకూర్‌)’ అని రాశాడు. 

Updated Date - 2020-09-20T09:14:17+05:30 IST