సచిన్‌.. కళ్లకు గంతలు కట్టుకొని!

ABN , First Publish Date - 2020-05-17T10:04:41+05:30 IST

‘కిందపడకుండా కాసేపు బ్యాట్‌తో బంతిని నాక్‌ చేయాలి’.. ఇది ఇటీవల హర్భజన్‌ సింగ్‌కు యువరాజ్‌ సింగ్‌ విసిరిన చాలెంజ్‌.

సచిన్‌.. కళ్లకు గంతలు కట్టుకొని!

న్యూఢిల్లీ: ‘కిందపడకుండా కాసేపు బ్యాట్‌తో బంతిని నాక్‌ చేయాలి’.. ఇది ఇటీవల హర్భజన్‌ సింగ్‌కు యువరాజ్‌ సింగ్‌ విసిరిన చాలెంజ్‌. దీన్ని భజ్జీ పూర్తి చేశాడు. తాజాగా సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించి పూర్తి చేశాడు. అయితే, మాస్టర్‌.. తనదైన స్టయిల్లో కళ్లకు గంతలు కట్టుకొని ఈ చాలెంజ్‌ను పూర్తి చేసి తానెప్పటికీ ప్రత్యేకమే అని చాటుకున్నాడు. సోషల్‌ మీడియాలో సచిన్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. 

Updated Date - 2020-05-17T10:04:41+05:30 IST