సిక్స్‌ప్యాక్ ఫొటో షేర్ చేసిన సైనీ.. టెన్నీస్ స్టార్ అతన్ని ఎవరితో పోల్చాడంటే..

ABN , First Publish Date - 2020-06-07T01:48:51+05:30 IST

టీం ఇండియా యువ స్పిన్నర్ నవ్‌దీప్ సైనీ.. అంతర్జాతీయ జట్టులో అడుగుపెట్టినప్పటి నుంచి.. అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు. వైట్-

సిక్స్‌ప్యాక్ ఫొటో షేర్ చేసిన సైనీ.. టెన్నీస్ స్టార్ అతన్ని ఎవరితో పోల్చాడంటే..

టీం ఇండియా యువ స్పిన్నర్ నవ్‌దీప్ సైనీ.. అంతర్జాతీయ జట్టులో అడుగుపెట్టినప్పటి నుంచి.. అద్భుత ప్రదర్శనతో ప్రశంసలు అందుకున్నాడు. వైట్-బాల్ క్రికెట్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన సైనీ ఇంకా టెస్టుల్లో ఆరంగేట్రం చేయలేదు. అయితే బౌలింగ్ మాత్రమే కాదు.. ఫిట్‌నెస్ విషయంలోనూ నవ్‌దీప్ అత్యంత శ్రద్ధ తీసుకుంటాడు. అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో అతనూ ఒకడు.


అయితే లాక్‌డౌన్ కారణంగా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు రద్దు కావడంతో సైనీ పూర్తిగా దృష్టిని వర్కవుట్‌పై పెట్టాడు. తాజాగా తన సిక్స్‌ప్యాక్ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అతను పంచుకున్నాడు. దీనిపై టెన్నీస్ స్టార్ యూకీ భాంబ్రి స్పందించాడు. నవ్‌దీప్ సైనీని అతను ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోతో పొల్చాడు. ‘నవ్‌దీప్ రొనాల్డో సైనీ’ అంటూ అతను కామెంట్ చేశాడు. 

Updated Date - 2020-06-07T01:48:51+05:30 IST