యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-06-18T07:32:44+05:30 IST
త్రిపుర అండర్-19 మహిళల క్రికెట్ జట్టులోని సభ్యురాలు అయాంతి రియాంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలోని తైనాని అనే గ్రామానికి

న్యూఢిల్లీ: త్రిపుర అండర్-19 మహిళల క్రికెట్ జట్టులోని సభ్యురాలు అయాంతి రియాంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. అగర్తలకు 90 కిలోమీటర్ల దూరంలోని తైనాని అనే గ్రామానికి చెందిన 16 ఏళ్ల అయాంతి మంగళవారం రాత్రి తన ఇంట్లో సీలింగ్‌కు ఉరివేసుకొని చనిపోయింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటన్నది తెలియరాలేదు. నలుగురు అక్కాచెల్లెళ్లలో అందరికంటే చిన్నదైన అయాంతి ఏడాది క్రితమే రాష్ట్ర అండర్-19 జట్టులో చోటు దక్కించుకుంది. అంతేకాదు.. అండర్-23 రాష్ట్రస్థాయి టీ20 టోర్నీలో కూడా పాల్గొంది.