అద్భుతమైన ప్రత్యర్థివి.. ధోనీకి స్మిత్ కితాబు!

ABN , First Publish Date - 2020-08-17T03:35:04+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ ధోనీపై ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

అద్భుతమైన ప్రత్యర్థివి.. ధోనీకి స్మిత్ కితాబు!

కాన్‌బెర్రా: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ ధోనీపై ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ కెరీర్ అత్యద్భుతమని చెప్పిన స్మిత్.. తాను ధోనీని విపరీతంగా అభిమానిస్తానని వెల్లడించాడు. తాను ఎదుర్కొన్న వారిలో అద్భుతమైన ప్రత్యర్థి ధోనీనే అని కితాబిచ్చాడు. అదే సమయంలో ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ కూడా ధోనీ రిటైర్‌మెంట్‌పై స్పందించాడు. ‘నీ స్టైల్లో అన్నీ చేశావ్’ అంటూ మెచ్చుకున్నాడు.

Updated Date - 2020-08-17T03:35:04+05:30 IST