చాలాసార్లు దేశం గర్వించేలా చేశావ్.. రోహిత్‌కు రైనా విషెస్!
ABN , First Publish Date - 2020-08-23T02:39:23+05:30 IST
రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు పొందిన క్రికెటర్ రోహిత్ శర్మకు మాజీ ఆటగాడు సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు.
ముంబై: రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు పొందిన క్రికెటర్ రోహిత్ శర్మకు మాజీ ఆటగాడు సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ అవార్డు గెలిచిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ‘ధన్యవాదాలు సోదరా. ఈ అవార్డుకు నువ్వు నిజంగా అర్హుడివి. భారతదేశాన్ని చాలాసార్లు గర్వపడేలా చేశావు. నీ జీవితంలో మరిన్ని మైలురాళ్లను అందుకోవాలని కోరుకుంటున్నా’ అని రైనా ట్వీట్ చేశాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, ఎమ్‌ఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు. ఇప్పుడు రోహిత్ కూడా ఈ జాబితాలో చేరాడు.