ధ్యానంతో మానసిక బలం

ABN , First Publish Date - 2020-12-10T08:59:31+05:30 IST

అథ్లెట్లు మానసికంగా దృఢంగా తయారవడానికి ధ్యానం అద్భుతంగా ఉపకరిస్తుందని బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్...

ధ్యానంతో మానసిక బలం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి):   అథ్లెట్లు మానసికంగా దృఢంగా తయారవడానికి ధ్యానం అద్భుతంగా ఉపకరిస్తుందని బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ చెప్పాడు. నాడు ఆటగాడిగా, నేడు కోచ్‌గా తన జీవితంలో ధ్యానం ఓ అంతర్భాగమని అన్నాడు. మానసిక శక్తి, ఏకాగ్రత, గెలవాలన్న తపన తదితర 10 అంశాలపై పలువురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ధ్యాన యాప్‌ ద్వారా ‘ధ్యాన ఫర్‌ స్పోర్ట్స్‌’ కార్యక్రమంలో వివరించనున్నారని తెలిపాడు. వారిలో గోపీతోపాటు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కశ్యప్‌, కిడాంబి శ్రీకాంత్‌, సిక్కిరెడ్డి, సుమీత్‌రెడ్డి, సాత్విక్‌, సిరిల్‌వర్మ, గురుసాయిదత్‌, సాయి ప్రణీత్‌ వంటి స్టార్‌ షట్లర్లున్నారు. యాప్‌ ద్వారా అనుసంధానం చేసే మెడిటేషన్‌ ట్రాకర్‌కు సంబంధించిన వివరాల్ని కూడా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో గోపీచంద్‌ వెల్లడించాడు. ఈ కార్యక్రమంలో అవంతరి టెక్నాలజీస్‌ ఎండీ భైరవ్‌ శంకర్‌, కోచ్‌ నాగపురి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T08:59:31+05:30 IST