సనా మీర్‌ వీడ్కోలు

ABN , First Publish Date - 2020-04-26T10:12:28+05:30 IST

పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం గుడ్‌బై చెప్పింది. 2005లో శ్రీలంకపై వన్డే ...

సనా మీర్‌ వీడ్కోలు

కరాచీ: పాకిస్థాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సనా మీర్‌ 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం గుడ్‌బై చెప్పింది. 2005లో శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ సనా 120 మ్యాచ్‌ల్లో 1630 పరుగులు చేయగా.. 151 వికెట్లు పడగొట్టింది. ఇక, 106 టీ20ల్లో 802 రన్స్‌, 89 వికెట్లు తీసింది. 2018లో ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సనా అగ్రస్థానంలో నిలిచింది. ఫామ్‌ కోల్పోవడంతో ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్‌క్‌పలోనూ ఆమెకు చోటు దక్కలేదు. 

Updated Date - 2020-04-26T10:12:28+05:30 IST