విలియమ్సన్ ‘డబుల్’
ABN , First Publish Date - 2020-12-05T07:14:38+05:30 IST
కెప్టెన్ కేన్ విలియమ్సన్ (412 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 251) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో వెస్టిండీస్‌తో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది...

హామిల్టన్: కెప్టెన్ కేన్ విలియమ్సన్ (412 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 251) డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో వెస్టిండీస్‌తో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 243/2తో రెండో రోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 519/7 వద్ద డిక్లేర్ చేసింది. మూడు సెషన్లలోనూ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కేన్ కెరీర్లో మూడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. జెమిసన్ (51 నాటౌట్) అర్ధ సెంచరీతో మెరిశాడు. గాబ్రియెల్ (3/89), రోచ్ (3/114) మూడేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ ఆట చివరకు 49/0 స్కోరు చేసింది. హోల్డర్ సేన ఇప్పటికి 470 పరుగుల వెనుకంజలో ఉంది. బ్రాత్‌వైట్ (20), క్యాంప్‌బెల్ (22) క్రీజులో ఉన్నారు.