కుశాల్ మెండిస్ అరెస్టు
ABN , First Publish Date - 2020-07-06T08:49:32+05:30 IST
ఓ వృద్ధుడి మరణానికి కారణమైన శ్రీలంక స్టార్ వికెట్ కీపర్ కుశాల్ మెండి్సను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం కొలంబో ...
కొలంబో: ఓ వృద్ధుడి మరణానికి కారణమైన శ్రీలంక స్టార్ వికెట్ కీపర్ కుశాల్ మెండి్సను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం కొలంబో శివార్లలోని పాత గాలె రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళుతున్న 64 ఏళ్ల వృద్ధుడిని మెండిస్ నడుపుతున్న ఎస్యూవీ కారు వేగంగా ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మెండి్సను మెజిస్ట్రేట్ ముందు సోమవారం హాజరుపర్చనున్నారు. 25 ఏళ్ల కుశాల్ మెండిస్ లంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు ఆడాడు.