కోవిడ్-19 ఎఫెక్ట్: ఇంగ్లండ్ పర్యటన వాయిదా వేసుకున్న వెస్టిండీస్
ABN , First Publish Date - 2020-04-26T01:08:34+05:30 IST
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య దేశంలో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసుకుంటున్నట్లు వెస్టిండీస్ క్రికెట్

ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్ వేదికగా ఆతిథ్య దేశంలో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసుకుంటున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ఇరు జట్ల మధ్య జూన్ 4వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకూ మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఇంగ్లండ్‌లో నెలకొన్ని పరిస్థితిలు అంతర్జాతీయ ప్రయాణలపై నిషేధం పడిన నేపథ్యంలో ఈ సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు విండీస్ బోర్డు పేర్కొంది.
దీనిపై వెస్టిండీస్ క్రికెట్ సీఈవో జానీ గ్రేవ్ మాట్లాడుతూ.. ‘‘జూన్‌లో మ్యాచ్‌లు జరగడం.. సాధ్యం కాదు. దీనిపై ఇంగ్లండ్ బోర్డుతో చర్చలు జరిపి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాము. మా ఆటగాళ్లు సురక్షితంగా ఉంటారని తెలిసిన తర్వాతే ఇంగ్లండ్‌లో పర్యటించేందుకు అనుమతిస్తాము. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత ప్రమాణాల గురించి.. సంబంధింత అధికారులతో చర్చలు జరుపుతున్నాము. ఆటగాళ్ల భద్రతకు ఎటువంటి ఇబ్బంది కలిగే ఏ విషయంలోనూ రాజీ పడే అవకాశం లేదు’’ అని తెలిపారు.