‘ఐసీయూలో వెస్టిండీస్‌ క్రికెట్‌’

ABN , First Publish Date - 2020-05-17T10:06:27+05:30 IST

కరోనా వైరస్‌ ధాటికి తమ దేశ క్రికెట్‌ ఐసీయూలోకి చేరిందని క్రికెట్‌ వెస్టిండీస్‌ (డబ్ల్యూసీఐ) చీఫ్‌ రికీ స్కెరిట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అసలే మా...

‘ఐసీయూలో వెస్టిండీస్‌ క్రికెట్‌’

కింగ్‌స్టన్‌: కరోనా వైరస్‌ ధాటికి తమ దేశ క్రికెట్‌ ఐసీయూలోకి చేరిందని క్రికెట్‌ వెస్టిండీస్‌ (డబ్ల్యూసీఐ) చీఫ్‌ రికీ స్కెరిట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అసలే మా దేశ క్రికె ట్‌ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. కొవిడ్‌-19తో అదికాస్తా ఐసీయూకి చేరింది. జబ్బుతో డాక్టర్‌ వద్దకు వెళితే ఆయన మందులు రాస్తుండగానే గుండెపోటు వచ్చినట్టు ఉంది మా పరిస్థితి’ అని రికీ అన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ జూన్‌లో ఇంగ్లండ్‌లో వెస్టిండీస్‌ జట్టు పర్యటించాలి. కానీ కరోనా దెబ్బకు అదికాస్తా వాయిదా పడింది. 

Updated Date - 2020-05-17T10:06:27+05:30 IST