నాకు చెప్పకుండా రద్దు చేస్తారా?
ABN , First Publish Date - 2020-03-16T10:32:16+05:30 IST
కొవిడ్-19 వైరస్ ఉధృతి నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన కోల్‌కతా వన్డేను రద్దు చేయడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం...
దాదాపై దీదీ గరంగరం
కోల్‌కతా: కొవిడ్-19 వైరస్ ఉధృతి నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన కోల్‌కతా వన్డేను రద్దు చేయడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి వన్డే వర్షార్పణం కాగా.. లఖ్‌నవ్, కోల్‌కతా మ్యాచ్‌లు రద్దయ్యాయి. అయితే తనకే మాత్రం సమాచారం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని దీదీ తప్పుబట్టారు. ‘సౌరవ్‌తో ఎలాంటి విభేదాలు లేవు. కానీ కోల్‌కతా మ్యాచ్ రద్దు విషయం మాతో ఓ మాట చెప్పాల్సింది. కనీసం ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, పోలీస్ కమిషనర్‌లలో ఎవరికైనా సమాచారం ఇవ్వాలి కదా’ అని మమతా అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో చివరిదైన మూడో వన్డే ఈనెల 18న జరగాల్సి ఉండేది.